చెత్త తరలించే వాహనాలు ప్రారంభించిన మంత్రి సవిత

7చూసినవారు
చెత్త తరలించే వాహనాలు ప్రారంభించిన మంత్రి సవిత
రొద్దం మండలంలో మంగళవారం, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి స్వచ్ఛ వాహనాలను ప్రారంభించారు. గ్రామాల్లో చెత్తను తరలించడం కోసం చెత్త బండ్లను కూడా పంపిణీ చేశారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర లక్ష్య సాధన కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా చెత్తను తరలించాలని ఉద్దేశంతో ఈ వాహనాలను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ప్రజలు ఈ కార్యక్రమానికి సహకరించాలని ఆమె తెలియజేశారు.