అనంతపురం జిల్లా గుత్తిలో శుక్రవారం చేనేత జౌళి శాఖ మంత్రి సవిత పర్యటించారు. బీసీ వెల్ఫేర్ అధికారి కుష్బూ కొఠారి, బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీ రామ్ తో మంత్రి సమావేశమయ్యారు. జిల్లాలోని బీసీ హాస్టళ్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని, విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు.