రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మంగళవారం హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. పెనుగొండ పట్టణంలోని క్యాంపు కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు, నాయకులు మంత్రిని కలిసి హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి సవిత సాంప్రదాయబద్ధంగా రంగులు పూసుకుంటూ కార్యకర్తలతో సరదాగా గడిపారు.