గుత్తి పట్టణ కేంద్రంలో అఖిల భారత కటిక కులదేవతల శ్రీశ్రీసునామా జకినీ మాత, శ్రీమల్కుమా జకినీ మాత అమ్మవార్ల 23వ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమంలో శుక్రవారం మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంతకల్లు గుమ్మనూరు జయరాం, కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వెంకటశివుడు యాదవ్, ఆరెకటిక డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ హెచ్. హరికృష్ణ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున ఆరెకటిక కులస్తులు పాల్గొన్నారు.