నిన్నటి రోజు పెనుగొండ పట్టణంలో మంత్రి సవితపై మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 'నీ అబ్బ జాగీరా' అంటూ పరుష పదజాలంతో ఆమె మంత్రి సవితపై ఫైర్ అయ్యారు. ఉషశ్రీ చరణ్ వ్యాఖ్యలను ఖండిస్తూ గోరంట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. మంత్రి సవిత ప్రతిపక్షంలో సైతం ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, అలాంటి మంత్రిపై ఉషశ్రీ చరణ్ వ్యాఖ్యలు సరికాదని వారు మండిపడ్డారు.