మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ కు మంత్రి సవిత వినతి

14చూసినవారు
మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ కు మంత్రి సవిత వినతి
పెనుకొండ నియోజకవర్గంలో ముస్లిముల అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ను మంత్రి సవిత కోరారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో బుధవారం మంత్రి ఫరూక్ ను కలిసిన మంత్రి సవిత, నియోజకవర్గంలో మైనార్టీ శాఖ తరఫున అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దర్గాలు, ఖబరస్థాన్ లు, షాదీ ఖానాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రాలు అందజేశారు. మంత్రి సవిత వినతులపై ఎన్ఎండీ ఫరూక్ సానుకూలంగా స్పందించారు.

ట్యాగ్స్ :