పరిగి మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ వరసిద్ధి వినాయక మరియు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి ఘన స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.