పరిగి: పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సవిత...

1చూసినవారు
పరిగి: పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సవిత...
పరిగి మండలం మోదా పంచాయతీలో బుధవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను స్థానిక నాయకులు, అధికారులతో కలసి మంత్రి సవిత లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా అందజేశారు. ప్రతి నెలా ఒకటో తేదీన ఠంఛన్ గా పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని, ఒకవేళ ఆ రోజు పండుగ లేదా ఆదివారం వస్తే ముందురోజే పెన్షన్లు అందజేస్తున్నామని మంత్రి తెలిపారు. గురువారం నూతన సంవత్సరం సంబరాలను దృష్టిలో పెట్టుకుని పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్