పెనుగొండ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో చేనేత జౌళి శాఖ మంత్రి సవితా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, ఉద్యోగులు మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి సవితా రాకతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.