పెనుకొండ: ఎయిడ్స్ పై అవగాహన ముఖ్యం...

10చూసినవారు
పెనుకొండ: ఎయిడ్స్ పై అవగాహన ముఖ్యం...
పెనుకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. జయప్ప, సోమవారం ఎన్ఎస్ఎస్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా, హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల జాగ్రత్త వహించాలని, ముఖ్యంగా యువతీ యువకులు అవగాహనతో పాటు సమీప గ్రామాల్లోనూ ప్రజలను చైతన్యపరచాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో 20 లక్షలకు పైగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని ఆయన తెలిపారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల సోదర భావంతో మెలగాలని కళాశాల జాతీయ సేవ పథకం ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ ప్రతాప్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఐక్యూఏసి కోఆర్డినేటర్ డాక్టర్ యశోద రాణి, ఎన్ఎస్ఎస్పీఓ కాంతారావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్