తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవితను పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు కలిశారు. ఈ సందర్భంగా నాయకులు సమస్యలపై మంత్రికి వినతులను అందజేశారు. మంత్రి సవిత వినతులను పరిశీలించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.