పెనుకొండ: దామాషా పద్ధతిలో బీసీ కార్పొరేషన్లకు నిధులు.. మంత్రి

3చూసినవారు
పెనుకొండ: దామాషా పద్ధతిలో బీసీ కార్పొరేషన్లకు నిధులు.. మంత్రి
రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత, జనాభా దామాషా పద్ధతిలో ఆయా కార్పొరేషన్లకు నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. సోమవారం విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్ లో 10 వివిధ బీసీ కులాల కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లతో సమావేశం నిర్వహించారు. బీసీ రక్షణ చట్టం రూపకల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, త్వరలోనే కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కుట్టు మిషన్లు అందజేయనున్నామని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్