పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని ఉప్పర వాడలో శనివారం నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేసి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన రాష్ట్రంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పండగ చేసుకుంటున్నారని, దేశంలో పెన్షన్లను నాలుగువేలకు పెంచిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదే అని మంత్రి సవిత అన్నారు.