పెనుకొండ: మార్నింగ్ వాకింగ్ చేసిన మంత్రి సవిత....

6చూసినవారు
పెనుకొండ: మార్నింగ్ వాకింగ్ చేసిన మంత్రి సవిత....
పెనుకొండ పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం ఉదయం రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌలి శాఖల మంత్రి సవితమ్మ స్థానిక ప్రజలతో కలిసి వాకింగ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజలతో నేరుగా మాట్లాడుతూ, పట్టణంలో ఉన్న పలు సమస్యలు, మౌలిక వసతులు, రోడ్లు, డ్రెయినేజీ, తాగునీటి సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెనుకొండ అభివృద్ధిని వేగవంతం చేసే దిశగా ప్రజల నుండి వచ్చిన సూచనలు, సలహాలను స్వీకరించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందని, పెనుకొండ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్