పెనుకొండ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితను పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యల పరిష్కారానికి మంత్రి సవితకు వినతిపత్రాలు అందజేశారు. వినతులను పరిశీలించిన మంత్రి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.