పెనుకొండ: ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడిన మాటలను వక్రీకరించాయి

5చూసినవారు
పెనుకొండ: ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడిన మాటలను వక్రీకరించాయి
మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు అంబేద్కర్ విగ్రహావిష్కరణలో చేసిన వ్యాఖ్యలను కొన్ని మతవాద సంస్థలు వక్రీకరించాయని బహుజన చైతన్య వేదిక అధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణ తెలిపారు. శనివారం పెనుకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారత రాజ్యాంగంతో దళితుల జీవన ప్రమాణాలు పెరిగాయని, భగవద్గీత, బైబిల్, ఖురాన్లను కించపరిచే ఉద్దేశం ఎమ్మెల్యేకు లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగం దళితుల జీవితాలను మెరుగుపరిచిందని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్