పెనుకొండ: సీఎం సహాయ నిధి చెక్కులను అందజేసిన ఎంపీ

3చూసినవారు
పెనుకొండ: సీఎం సహాయ నిధి చెక్కులను అందజేసిన ఎంపీ
పెనుకొండ పట్టణంలోని మడకశిర రోడ్డులో గల పార్లమెంట్ సభ్యుల కార్యాలయంలో గురువారం, ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను హిందూపురం ఎంపీ బి. కె. పార్థసారథి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, 13 మంది లబ్ధిదారులకు మొత్తం 6,50,743 రూపాయలను చెక్కుల రూపంలో అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కూడా పాల్గొన్నారు.