పెనుకొండ మండలం మునిమడుగు గ్రామంలో మంగళవారం మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేఖంగా కోటి సంతకాల సేకరణ (రచ్చబండ) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసి పేదలకు విద్య, వైద్యం దూరం చేయాలని చూస్తున్నారని, ఫీజులు చెల్లించుకోలేని పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.