పెనుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ -1 వాలంటీర్లు బుధవారం స్పెషల్ క్యాంపులో భాగంగా రెండవ రోజు స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొండంపల్లి గ్రామంలోని ఎంపీపీ స్కూల్ నుండి బస్సు స్టాప్ వరకు రోడ్ల పక్కన ఉన్న పిచ్చి మొక్కలు, కంప చెట్లను తొలగించారు. ప్రజలు చెత్తను ఒకే చోట పారవేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ నివారణ, తడి-పొడి చెత్త గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, గ్రామ ప్రజలు, కులాయప్ప, రామచంద్రారెడ్డి, ఎన్ఎస్ఎస్ యూనిట్-1 పి ఓ డి శివన్న పాల్గొన్నారు.