అన్ని రంగాల్లో ఆర్యవైశ్యుల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి ఎస్. సవిత తెలిపారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ, ఏపీ ఆర్యవైశ్య మహాసభ, ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి, వాసవీ ఫౌండేషన్, ఐవీఎఫ్ ప్రతినిధులు మంత్రి సవితను కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలోని వైశ్యులను ఆర్య, శెట్టి, గుప్త, కోమటి, వేగిన, బుక్క, జనపశెట్టి అనే పేర్లతో సంభోదిస్తున్నారని, వారందరినీ ఆర్యవైశ్యులుగా ప్రభుత్వం గుర్తించి చర్యలు తీసుకోవాలని వారు కోరారు.