మంత్రి సవిత బుధవారం పెనుకొండ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉత్తమ కార్యకర్తలుగా ఎంపికైన 151 మందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో విశేష సేవలు అందించిన వారిని గుర్తిస్తూ, తెలుగుదేశం పార్టీ జాతీయ నారా లోకేష్ ఆదేశాల మేరకు ఈ ప్రశంసాపత్రాలు మంజూరు చేసినట్లు తెలిపారు. కార్యకర్తలే పార్టీకి అసలైన బలం, ఊపిరి అని ఆమె పేర్కొన్నారు.