బత్తలపల్లి సమీపంలో కారు బోల్తా పడిన ఘటనలో 10మంది గాయపడ్డారు. పోలీసులు తెల్పిన వివరాలు మేరకు శనివారం అనంతపురం నుంచి కదిరి వైపునకు వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు అదుపు తప్పి పడిపోయింది. అందులోని ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనాలలో బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.