పెనుకొండ నియోజకవర్గం పరిగి మండలం గణపతి పల్లి గ్రామానికి చెందిన కురబ కులస్తులు, గ్రామంలో శ్రీభక్త కనకదాసు విగ్రహ నిర్మాణానికి సహకరించాలని హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి. కె. పార్థసారథిని కోరారు. గురువారం రొద్దం మండలంలోని ఆర్ మరువపల్లి గ్రామంలోని ఎంపీ స్వగృహంలో కురబ కులస్తులు ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ భక్త కనకదాసు విగ్రహాన్ని విరాళంగా అందజేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కురబ కులస్తులు ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.