పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం నల్లూరు గ్రామంలో, నల్లూరు నుండి కల్లుకుంటకు వెళ్లే దారిలో పెన్నానదిపై రూ. 4 కోట్ల 40 లక్షల నిధులతో పూర్తయిన కాజ్ వేను మంత్రి సవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.