రొద్దం: ఎంపీపీ పాఠశాలను తనిఖీ చేసిన మంత్రి సవిత...

4చూసినవారు
రొద్దం: ఎంపీపీ పాఠశాలను తనిఖీ చేసిన మంత్రి సవిత...
రొద్దం మండలం సానిపల్లి గ్రామంలోని ఎంపీపీ పాఠశాలను సోమవారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలో ఉన్న సమస్యల గురించి తెలుసుకున్నారు. విద్యార్థులు అదనపు తరగతుల భవనాలు అసంపూర్తిగా ఉండటాన్ని గుర్తించి వాటిని వెంటనే పూర్తి చేయించాలని కోరారు. మంత్రి దీనిపై స్పందించి ఈ భవనాలను త్వరలోనే పూర్తీ చేసి విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్