రొద్దం: అంత్యక్రియలు కోసం ఆర్థిక సహాయం అందజేసిన మంత్రి సవిత

4చూసినవారు
రొద్దం: అంత్యక్రియలు కోసం ఆర్థిక సహాయం అందజేసిన మంత్రి సవిత
రొద్దం మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త తలారి హనుమంతప్ప శనివారం అకస్మాత్తుగా మరణించారు. మంత్రి సవిత ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి, పార్టీ జెండా కప్పి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, అధైర్యపడవద్దని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అంత్యక్రియల కోసం ఆర్థిక సహాయం కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :