సోమందేపల్లి మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 'చేనేతల పోరు' కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ హాజరుకానున్నారు. నేతన్నలకు అండగా నిలిచేందుకు పార్టీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. శ్రీచౌడేశ్వరి అమ్మవారికి పూజల అనంతరం మెయిన్ బజార్, మారుతీ నగర్, ఇందిరానగర్, గీతా నగర్ మీదుగా ర్యాలీ చేపట్టనున్నారు.