రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత సోమందేపల్లిలో ఆదివారం భక్త కనకదాసు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలోనే కురుబ కులస్తులకు బీసీలకు గుర్తింపు, న్యాయం, గౌరవం లభిస్తోందని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో పలుచోట్ల భక్త కనకదాసు విగ్రహాలు ఆవిష్కరించినట్లు మంత్రి గుర్తు చేశారు. మంత్రి సవిత తలపై కలశం పెట్టుకుని విగ్రహావిష్కరణ వరకు ఊరేగింపుగా వెళ్లారు.