సోమందేపల్లి మండల కేంద్రంలోని ఎన్టీఆర్ సర్కిల్ లో సిఐటియు ఆధ్వర్యంలో ఆశ వర్కర్స్ యూనియన్ నాయకులు రజియా, గాయత్రి ల అధ్యక్షతన సిఐటియు ఆల్ ఇండియా మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ గోడ పోస్టర్లను విడుదల చేశారు. ఈ నెల 31 వ తేదీ నుండి జనవరి 4 వ తేదీ వరకు విశాఖపట్నంలో జాతీయ మహాసభలు జరుగుతాయని, జనవరి 4 వ తేదీన భారీ బహిరంగ సభ జరుగుతుందని, సంఘటిత, అసంఘటిత కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి శ్రీదేవి, జిల్లా కమిటీ సభ్యులు కొండా వెంకటేష్ లు కోరారు.