మంత్రి సవిత ను కలసిన రాష్ట్ర పాల ఏకరి కార్పొరేషన్ చైర్మన్...

10చూసినవారు
మంత్రి సవిత ను కలసిన రాష్ట్ర పాల ఏకరి కార్పొరేషన్ చైర్మన్...
పెనుకొండ పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో గురువారం రాష్ట్ర పాల ఏకరి కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు నాయుడు మంత్రి సవితను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా పాల ఏకరి కులానికి చెందిన ఉప కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం సమర్పించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. అలాగే సోమందేపల్లి మండల కేంద్రంలో పాల ఏకరి కులదైవమైన వీర పాండ్యా కట్ట బ్రాహ్మణ విగ్రహ స్థాపన కోసం స్థలాన్ని కేటాయించాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ విషయంపైన మంత్రి సానుకూల స్పందన వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you