పెనుగొండలో బుల్లెట్ నడిపిన మంత్రి

10చూసినవారు
రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత, పెనుకొండ పట్టణంలో నిర్వహించిన 37వ రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె హెల్మెట్ ధరించి బుల్లెట్ బండి నడుపుతూ పట్టణంలోని ప్రధాన రహదారిలో ర్యాలీగా వెళ్లారు. మంత్రి సవితతో పాటు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్, పోలీసులు, రవాణా శాఖ అధికారులు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు.

సంబంధిత పోస్ట్