వేప చెట్టు నుంచి కారుతున్న కల్లు

3చూసినవారు
వేప చెట్టు నుంచి కారుతున్న కల్లు
రొద్దం మండలం చెరుకూరు సమీపంలో ఒక వేప చెట్టు నుంచి కల్లు కారుతుండటం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా తాటి, ఈత చెట్ల నుంచి వచ్చే కల్లు ఇక్కడ వేప చెట్టు నుంచి రావడం ఒక వింతగా మారింది. ఈ సంఘటనను దైవ మహిమగా భావించిన మహిళలు చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వింతను చూడటానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

సంబంధిత పోస్ట్