పరిగి మండలం ఊటకూరు వద్ద జయమంగళి నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. ఎస్సై రవికుమార్ ఆదేశాల మేరకు ఈ దాడులు జరిగాయి. అనుమతులు లేకుండా ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. మరోవైపు, మార్కెట్లో ఇసుక ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.