
మంత్రి సవితను కలిసిన పరిగి ఎస్ఐ
శుక్రవారం పరిగి నూతన ఎస్సై రవికుమార్, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితను పెనుగొండలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి సవిత ఆయనకు పుష్పగుచ్ఛం అందించి, శాంతిభద్రతల పరిరక్షణలో నిష్పక్షపాతంగా పనిచేయాలని, అసాంఘిక కార్యకలాపాలు, నేరాలు జరగకుండా అడ్డుకోవాలని సూచించారు.







































