
ఓబులదేవర చెరువులో క్లినిక్ సీజ్
ఓబులదేవర చెరువులోని 'హనుమాన్ మెడికల్ స్టోర్'ను కలెక్టర్ శ్యాంప్రసాద్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓ ఆర్ఎంపీ నిబంధనలకు విరుద్ధంగా రోగులకు ఇంజెక్షన్లు, స్టెరాయిడ్లు ఇస్తూ కలెక్టర్‌కు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. అనుమతి లేకుండా వైద్యం అందిస్తున్నట్లు నిర్ధారించి, క్లినిక్‌ను సీజ్ చేశారు. అనంతరం స్థానిక సాక్షుల సమక్షంలో పంచనామా నిర్వహించి, కేసు నమోదు చేశారు.






































