May 14, 2026, 17:05 IST/ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి
కష్టపడి కాదు ఇష్టపడి చదివితేనే భవిష్యత్తు బాగుంటుంది
May 14, 2026, 17:05 IST
సదాశివనగర్ మండలం భూంపల్లి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించి, ఐదుగురు 500 పైన మార్కులు సాధించిన సందర్భంగా గ్రామస్థులు విద్యార్థులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు మాట్లాడుతూ, విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితేనే భవిష్యత్తు బాగుంటుందని, కలలుగన్న వాటిని నిజం చేసుకోవాలని సూచించారు.