May 08, 2026, 18:05 IST/ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి
ఇందిరా మహిళా శక్తి భవన పనులను పరిశీలించిన కలెక్టర్
May 08, 2026, 18:05 IST
తెలంగాణ ప్రభుత్వం రూ. 5 కోట్లతో మంజూరు చేసిన జిల్లా ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు. భవన నిర్మాణ పనుల పురోగతి, నాణ్యతా ప్రమాణాలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. 2026 మే 25వ తేదీలోగా పనులను పూర్తి చేసి సకాలంలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. మహిళా సాధికారతకు ఈ భవనం వేదిక కావాలని, నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని కలెక్టర్ సూచించారు.