అమడగూరు మండలం గుండువారిపల్లి పంచాయతీ సోలుకుంట్లపల్లి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు వెంకటరెడ్డి తల్లి సుభద్రమ్మ సోమవారం మరణించారు. ఈ వార్త తెలిసిన వెంటనే పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి గ్రామానికి చేరుకుని, సుభద్రమ్మ భౌతిక దేహంపై పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం, ఆయన మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.