విలేఖరి హత్యను ఖండించిన ఏపీయూడబ్ల్యూజే

771చూసినవారు
విలేఖరి హత్యను ఖండించిన ఏపీయూడబ్ల్యూజే
చిత్తూరు జిల్లాలో గంధపు చెక్కల స్మగ్లింగ్ పై వార్తలు రాసినందుకు విలేకరి జగన్మోహన్ రెడ్డిని దారుణంగా హత్య చేసిన ఘటనపై సత్య సాయి జిల్లా ఏపీయూడబ్ల్యూజే నాయకులు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనను ఖండిస్తూ, జిల్లా కలెక్టర్, ఎస్పీలను కలిసి వినతి పత్రం అందజేశారు. వెంటనే నిందితులను అరెస్ట్ చేసి శిక్షించాలని నాయకులు పుల్లయ్య బాబు డిమాండ్ చేశారు.