రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి

1362చూసినవారు
బుక్కపట్నం మండలం గరుగుతాండ సమీపంలో అతివేగంగా వచ్చిన కారు ఒక ఆటోను వెనుక నుండి ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఢీకొన్న ధాటికి ఆటో రోడ్డు అవతలికి ఎగిరిపడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్