సత్యసాయి జిల్లాలోని అన్ని స్కానింగ్ సెంటర్లను ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. గురువారం పుట్టపర్తి కలెక్టరేట్లో ఆరోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో, స్కానింగ్ సెంటర్లలో గర్భస్థ లింగ నిర్ధారణ
పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. లింగ నిర్ధారణ
పరీక్షలు నేరమని తెలిపే పోస్టర్లను స్కానింగ్ సెంటర్లలో ప్రజలకు కనిపించేలా ప్రదర్శించాలని కలెక్టర్ ఆదేశించారు.