శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ. శ్యాం ప్రసాద్ బుధవారం కొత్తచెరువు గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తచెరువు-2 గ్రామ సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఏకీకృత కుటుంబ సర్వేలో స్వయంగా పాల్గొన్నారు. ప్రభుత్వ సేవలను క్రమబద్ధీకరించడానికి గృహ సమాచారాన్ని నవీకరించడం లక్ష్యంగా ఈ సర్వే జరుగుతోంది. ఈ సందర్భంగా, కలెక్టర్ ఒక కుటుంబానికి సర్వే చేయడానికి పట్టే సమయాన్ని తెలుసుకున్నారు. త్వరితగతిన సర్వే పూర్తి చేయడానికి, ఉద్యోగులు ముందుగానే అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలని, ఒక రోజుకు 10 గృహాలను సర్వే చేయాలని సూచించారు.