ధర్మవరం నియోజకవర్గంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల పరీక్ష ఫీజు కోసం, ధర్మవరం బీజేపీ నేత హరీష్ బాబు బుధవారం సత్య సాయి జిల్లా డీఈవో కిష్టప్పకు ఒక చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ, విద్యార్థుల కుటుంబాలపై ఆర్థిక భారం పడకుండా మంత్రి సత్యకుమార్ యాదవ్ తన సొంత డబ్బులతో ఈ ఫీజులను చెల్లించారని తెలిపారు.