ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


నోబెల్‌ రేసులో ట్రంప్‌ పేరు.. ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
May 01, 2026, 05:05 IST/

నోబెల్‌ రేసులో ట్రంప్‌ పేరు.. ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

May 01, 2026, 05:05 IST
ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారంగా భావించే నోబెల్ శాంతి బహుమతి 2026 కోసం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ ఏడాది ప్రతిష్ఠాత్మకమైన ఈ పురస్కారం కోసం మొత్తం 287 మంది అభ్యర్థులు నామినేట్ అయినట్లు నార్వేజియన్ నోబెల్ కమిటీ అధికారికంగా ధ్రువీకరించింది. ఇందులో 208 మంది వ్యక్తులు, 79 సంస్థలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా ఈ జాబితాలో ఉందని వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్, పాకిస్థాన్, కంబోడియా దేశాలకు చెందిన అగ్రనేతలు ట్రంప్ పేరును నామినేట్ చేసినట్లు బహిరంగంగా ప్రకటించారు. అయితే, నోబెల్ కమిటీ నిబంధనల ప్రకారం నామినేట్ అయిన వారి పేర్లను 50 ఏళ్ల వరకు అధికారికంగా వెల్లడించరు.