బుక్కపట్నం సాయిబాబా వీధికి చెందిన సోమశేఖర్ (36) కుటుంబ విషయాలపై భార్యాభర్తల మధ్య జరిగిన వాగ్వాదంతో మనస్తాపానికి గురై ఇంట్లోనే కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న ఎస్సై వెంటనే స్పందించి, క్షతగాత్రుడిని పోలీసు వాహనంలో పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.