శ్రీసత్య సాయి జిల్లా కలెక్టర్ ఏ. శ్యాం ప్రసాద్ బుధవారం పుట్టపర్తి జిల్లా కలెక్టరేట్ లో మీసేవా నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. మీసేవా నిర్వాహకులు సమర్థవంతంగా, సంతృప్తికరంగా సేవలను అందించాలని, మ్యుటేషన్, కుల, ఆదాయం, జనన ధ్రువీకరణ సర్టిఫికెట్లు వంటి రెవెన్యూ సేవలను పారదర్శకంగా, వేగంగా జారీ చేయాలని ఆదేశించారు. అదనపు ఛార్జీలు వసూలు చేయవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కూడా పాల్గొన్నారు.