గురువారం కొత్తచెరువు మండలం తిరుమల దేవరపల్లిలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు పాసుపుస్తకాలను అందజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలపై రైతులు అవగాహన కలిగి ఉండాలని ఆమె సూచించారు.