బహుమతులు వద్దు.. సేవలే ముద్దు: సత్యసాయి కలెక్టర్

4చూసినవారు
బహుమతులు వద్దు.. సేవలే ముద్దు: సత్యసాయి కలెక్టర్
న్యూ ఇయర్ సందర్భంగా పూలబొకేలు, శాలువాలు, కేకులు తీసుకురావద్దని సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ కోరారు. వీటి బదులు విద్యార్థులకు పుస్తకాలు, నిరుపేదలకు బెడ్‌షీట్లు, టీబీ రోగులకు పోషకాహార కిట్లు అందించాలని సూచించారు. సమాజంలోని అణగారిన వర్గాలకు సేవ చేయడమే నిజమైన శుభాకాంక్షలని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారానే సమాజానికి మేలు జరుగుతుందని కలెక్టర్ ప్రజలకు పిలుపునిచ్చారు.