పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువులో స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి, 'జోహార్
ఎన్టీఆర్, జై తెలుగుదేశం' అంటూ నినాదాలు చేశారు.