పుట్టపర్తి లో మన్యం వీరుడికి అధికారుల నివాళులు

7చూసినవారు
పుట్టపర్తి లో మన్యం వీరుడికి అధికారుల నివాళులు
పుట్టపర్తి కలెక్టరేట్‌లో గురువారం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం అల్లూరి చేసిన పోరాటం, త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు. నేటి యువత ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.